రామకృష్ణాపూర్, ఆగస్టు 31 : బొగ్గు గనుల్లో రక్షణకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని, ప్రమాద రహిత సంస్థ కోసం నిరంతరం కృషి చేస్తామ ని సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉత్వల్ థా అధ్యక్షతన 49వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి అధికారులనుద్దేశించి ప్రసంగించారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పిత్తిలో ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రతి కా ర్మికుని ప్రాణం ఎంతో విలువైనదని, ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులంతా రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాలని కోరారు.
మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం గనుల్లో రక్షణ చర్య ల పెంపు కోసం కార్మిక సంఘాల నాయకులు అనేక సూచనలు చేశారు. నాణ్యమైన హెల్మె ట్లు, బూట్లు సరఫరా చేయాలని, మెరుగైన వై ద్య సేవలు అందించాలని, క్యాంటీన్లలో సకల సౌ కర్యాలు కల్పించాలని, కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని.. గుర్తింపు కార్మిక సం ఘం ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్‌కుమార్, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్, ఇతర నాయకులు పలు సూచనలు చేశారు.
అనంతరం రక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ టీ ఆర్. కన్నణ్, డీజీఎంఎస్ అధికారులు రక్షణ పెంపుదల కోసం పలు సూచనలు చేశారు. సంస్థ డైరెక్టర్లు (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు, (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే. వెంకటేశ్వర్లు, (పీఏ అండ్ డబ్ల్యూ) గౌతం పొట్రూ ఐఏఎస్, రక్షణ చర్యలపై ప్రసంగించారు. ఇటీవల పలు ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి జీఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్ రక్షణ నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.