ఎదులాపురం, జూన్ 22: ఆదివాసీ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సికిల్సెల్ అనీమి యా స్క్రీనింగ్ పరీక్షలు పకడ్బందీగా చేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య సి బ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, వారంలో 20వేల పరీక్షలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
సంవత్సరం పాటు 60వేలకు పైగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి కావాలన్నారు. వానకాలంలో సీజనల్ వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. అన్ని పీహెచ్సీలలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకో వాలని కోరారు. పీహెచ్సీలలో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, డీఎంవో మెట్పెల్లివార్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.