జైనూర్ : మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ( Asrama Patasala) తాగడానికి గుక్కెడు నీరు (Drinking water ) లేక విద్యార్థినిలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలచిపోవడంతో పాటు బోర్వెల్ ( Borewell ) చెడిపోవడంతో తాగు నీరు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఇక చేసేదేమీ లేక స్థానిక గ్రామంలోకి వెళ్లి బోరింగ్ నీళ్లు తెచ్చుకొని వాటర్ బాటిల్లో నింపుకుంటున్నారు. అసలే ఎండాకాలం భానుడు భగ భగ నిప్పులు చెరుగుతున్న వేళ చిన్నారులకు తాగు నీటి సరఫరా ఆగిపోవడం బాధాకరమని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు గతిన స్పందించి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.