జైనూర్, జూన్ 6 : జైనూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తాలోగల ఆటో స్టాండ్ వద్ద గురువారం ఆసిఫాబాద్ డివిజన్ షీ టీమ్ సభ్యులు మహిళలకు చట్టాలపై అవగాహన కల్పి ంచారు. షీ టీమ్ సభ్యురాలు సునీత మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు హింస,
ఈవ్‌టీజింగ్, సైబర్ క్రైమ్‌లకు గురైనట్లయితే వెంటనే షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు. మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీ టీమ్‌లు పనిచేస్తున్నాయని, ఏదైనా అత్యవసరమైతే డయల్ 100, 8712670564లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్చార్జి సునీత, సభ్యులు, శ్రీలత, స్వప్న పాల్గొన్నారు.