గుట్ట దిగితేనే.. గొంతు తడిచేది..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- భగీరథ నీరు అందక తీవ్ర ఇబ్బందులు
- నీటి కోసం మూడు కిలోమీటర్లు నడక
తాంసి, మే 28 ః ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం గుట్ట మీద ఉండడంతో రోజు గ్రామస్తులు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి కింద బోరు నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
సర్పంచ్ మడావి ఆశిక్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తాగునీరు అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే తాంసి మండలంలోని అంబుగాం, అట్నం గూడ, గిరిగామ, లీంగూడ గ్రామాల్లో నెలలో 15 రోజులు భగీరథ నీరు రావడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే భగీరథ నీరు అందించాలని వారు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

