నిర్మల్ : నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై టైరు పేలి డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఆర్మూర్లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం ఐచర్ వాహనంలో బయలుదేరారు.
వాహనం కొండాపూర్ గ్రామ సమీపానికి చేరుకోగానే ముందు టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలు కావడంతో వారిని చికిత్సల కోసం నిర్మల్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.