ఎదులాపురం, ఫిబ్రవరి 20 : సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయా శాఖల అధికారులతో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారా సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. షామియానాలు, బారికేడ్లు, భోజనాలు, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్యసేవలు, రవాణ, సౌండ్ సిస్టం తదితర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులును కేటాయించినట్లు చెప్పారు.
సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి, జయంతి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. వివిధ గ్రామాల నుంచి జయంతి వేడుకలకు వచ్చేవారికీ ఆర్టీసీ ద్వారా ఆదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే వారికి ఉత్సవ కమిటీ సూచనల మేరకు వాహనాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీవో కిషన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.