ఎదులాపురం/ నిర్మల్‌టౌన్, అక్టోబర్ 30: జిలా ల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నా రు. సోమవారం ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై ఆయన న్యూ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నా రు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కే టాయించే సమయంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు. అభ్యర్థుల సమక్షంలో ఈవీ ఎం యంత్రా ల రెండో ర్యాండమైజేషన్ చేపట్టాల ని అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాం డమైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. సీ-విజల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నా రు.
ఎన్నికల నోటిఫికేషన్ 3న ప్రారంభమవుతుందని 10వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుందని తెలిపారు. అన్ని రిటర్నింగ్ కార్యాయలయాల్లో సి బ్బంది ఎన్నికల నియమావళికి అనుగుణంగా పని చేయాలని, సమయపాలన పాటించాలని అన్ని వి వరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ జిల్లా ను చి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఐటీడీ ఏ పీ వో చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్లు ఖుష్బుగుప్తా, శ్యామలాదేవి ఉన్నారు. నిర్మల్ జిల్లా నుం చి కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత ఎన్నికల కమిషన్ అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల రాజకీయ ప్రచారం ఇతర అంశాలపై ఎన్నికల కోడ్ నిబంధనను పాటించాలని కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఫోటోలు, వీడియో లు అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రం లో ప్రత్యేక టీం పని చేస్తోందని తెలిపారు. అన్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని పౌ రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.