శ్రీరాంపూర్, జూలై 14 : ఆర్కే-7 గని నార్త్ లో బొగ్గు ఉత్పత్తికి ఫారెస్టు, ఎన్విరాన్మెంట్ శాఖల అనుమతి తీసుకోవడంలో నిర్లక్ష్యం చే సిన అధికారులను సస్పెండ్ చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అ హ్మద్ డిమాండ్ చేశారు. నాలుగేండ్లుగా అనుమతులు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించ డం వల్ల ఈ రోజు 1300 మంది కార్మికులు ఆందోళనకు గురికావాల్సి వస్తుందని ఆరోపించారు. ఇందులో మైన్ లీజు అనుమతి ఒక డ్రామాగా కనబడుతున్నదని ఆరోపించారు. ఇంత కాలం అధికారులు నిద్రపోయారా? అ ని ప్రశ్నించారు. గని మూసి వేసే వరకు రావ డం శోచనీయం అన్నారు. దీనికి అధికారులు, యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గనిలో డిప్యూటేషన్ పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు.
యాజమాన్యం త్వరితగతిన అనుమతులు తెప్పించాలన్నారు. గత జీ ఎం కూడా ఆర్కే-8గని మూసివేత సమయం లో డిప్యూటేషన్ల పేరిట లక్షల రూపాయల అ క్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించా రు. ఆర్కే-7 గనిలో కూడా అలాంటి అవినీతి కి తావులేకుండా చూడాలన్నారు. అనుమతు లు జాప్యం కావడానికి సంస్థ డైరెక్టర్ పీపీ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వెంటనే అనుమతు లు తెప్పించి గనిలో ఉత్పత్తి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి జీవన్జోయెల్, ఉపాధ్యక్షుడు తిప్పారపు సారయ్య, కార్యదర్శి అనిల్‌రెడ్డి, నాయకులు లక్షణ్, అశోక్, సందీప్, వినయ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.