ఇంద్రవెల్లి : ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ( Nagoba Jatara ) కు భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో నాగోబా ఆలయం జనసంద్రమైంది. బారులు తీరి నాగోబా దర్శనం తీసుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah ) నాగోబాను దర్శించుకున్నారు.
అనంతరం మేస్రం వంశీయులు చైర్మన్‌ను శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, శంకర్, ప్రవీణ్, లక్ష్మీ నారాయణ, డీఎన్డీవో సునీత, డీటీ డబ్ల్యూ అంబాజీ, ఎస్డబ్ల్యూవోలు నర్సింగ్, నారాయణ రెడ్డి, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్ రావు, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.