పెంబి, డిసెంబర్ 23 : పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. పెంబి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ బా గుండడంతో ఎస్ఐ, సిబ్బందిని అభినందించా రు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒ క్కరూఅంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ అజయ్ బా బు, ఎస్ఐ రజనీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.