బాసర, ఆగస్టు 23 : శ్రావణమాసం మూడవ శుక్రవారాన్ని పురస్కరించుకొని బాసర అమ్మవారి క్షేత్రంలోని అక్షరాభ్యాస మండపంలో సామూహిక సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ వైదిక బృందంతో పాటు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బాసర సరస్వతీ అమ్మవారికి లోకేశ్వరం మండలం గడ్చందా గ్రామానికి చెందిన దమ్మన్నగారి కవితా నాగేందర్ దంపతులు అమ్మవారికి సుమారు 500 గ్రాముల వెండితో చేసిన వీణను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.