ఇచ్చోడ(సిరికొండ), మే 19 : సిరికొండకు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ సిరికొండ సర్పంచ్, పాలకవర్గం మంత్రి హరీశ్‌రావుకు గతంలో విన్నవించారు. మాజీ ఎంపీ నగేశ్ కూడా ఈ విషయమై పలుమార్లు మంత్రి హరీశ్‌రావును కలిసి విన్నవించారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సిరికొండ మండలకేంద్రానికి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావుకు, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సిరికొండ పంచాయతీ పాలకవర్గం, మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని సర్పంచ్ నర్మదా పెంటన్న తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.