కుభీర్ : కుభీర్ మండలంపార్డి (బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వారం రోజులుగా కొనసాగుతున్న సప్తమి వేడుకలు(Saptami Celebrations) మంగళవారం పల్లకి ఊరేగింపు, అన్నదానంతో ముగిశాయి. ఈ వేడుకలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలను జరుపుకుంటూ ప్రతి ఇంటికి కనీసం ఒక్కరికైనా శివుని పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పార్డి (బీ) నిలిచిపోతుందని అన్నారు. శివరాత్రి ఉత్సవాలు ఈ గ్రామంలో జరుపుకున్నంత భక్తిశ్రద్ధలతో ఎక్కడ కనిపించదని అన్నారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వి.మోహన్, బోయిడి విట్టల్, వడ్నం నాగేశ్వర్, రాందాస్, గ్రామస్తులు, భజన మండలి సభ్యులు ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.