నెన్నెల : ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma Houses ) పేరిట నెన్నెల మండలంలో ఇసుక ( Sand ) దోపిడీ యధేచ్చగా కొనసాగుతుంది. స్థానిక ఇండ్లకు ఇసుక పర్మిషన్ ఇవ్వని అధికారులు పక్కా మండలాలకు ఇసుక తీసుకుపోయేందుకు మాత్రం అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో దాదాపు 40 ఇండ్లకు ఇసుక లేక నిర్మాణాలు నిలిచి పోయాయి.
స్థానిక వాగు నుంచి స్థానికులు ఇసుక తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన టోకెన్లతో ట్రాక్టర్లను తీసుకొని వెళితే అనుమతులు లేవంటు 5 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారని వాపోయారు. స్థానికంగా కర్జీ ఇసుక రిచ్ ఉన్నప్పటికీ అధికారులు మాత్రం మైలారం వాగు పేరిట అనుమతులను బెల్లంపల్లి మండలం ట్రాక్టర్లకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట తరలిస్తున్న ఇసుక ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి ఉందని ఆరోపించారు. ఇసుక తరలింపుపై నిఘా లేక పోవడం తో ట్రాక్టర్ యాజమానులు ఇష్టరాజ్యాంగ బయట మార్కెట్ లో రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు విక్రయిస్తు కోట్లు దోచుకుతింటున్నారని సమాచారం. ఒక్క ఇంటికి 8 నుంచి 10 ట్రిప్పులు ఇసుకకు అనుమతులు ఇస్తున్నా, అన్ని ట్రిప్పులు యాజమానికి చేరడం లేదని సర్వత్రా ఆరోపణలు వినబడుతున్నాయి.