ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మే 18 : 2025-26 విద్యాసంవత్సరానికిగాను ప్రైవేట్-కార్పొరేట్ కళాశాలల్లో (ఇంటర్‌తో పాటు ఎంసెట్ కోచింగ్) ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సజీవన్ ఓ ప్రకటనలో తెలిపారు. 2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 7-జీపీఏ కంటే ఎకువ వచ్చిన షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు/వెనుకబడిన తరగతులు/ఈబీసీ/మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోగా ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఎయిడెడ్, ఆశ్రమ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, నవోదయ, ఆదర్శ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, తప్పనిసరిగా ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్లు, మీ సేవ నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి మెమో, ఆధార్, రేషన్ కార్డులు అప్లోడ్ చేయాలని తెలిపారు.