నార్నూర్ : గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడలలో ( National-level sports ) రాణించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందోర్ దాదిరావు ( Dadi rao ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం హీరాపూర్ గ్రామంలో క్రికెట్ ( Cricket ) టోర్నమెంట్ పోటీలను ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. గ్రామీణ యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాదిగూడ మాజీ వైస్ ఎంపీపీ మర్సివానే యోగేష్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్, సర్పంచ్ రాథోడ్ కళ్యాణి, మేస్రం రాజు పటేల్, ఉప సర్పంచ్ మేస్రం దేవ్ రావ్, యూత్ అధ్యక్షుడు యాదవ్ రావ్,వాచ్మెన్ తదితరులున్నారు.