కౌటాల, జనవరి 20 : సిర్పూర్(టీ) మండ లం డోర్పల్లి కొమ్ముగూడకు చెందిన విద్యార్థి జైసన్ అనారోగ్యంతో బాధపడుతుండగా, సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అతడి ఇంటికెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం తనవంతు సాయమందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో భూ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు.
మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వుయ్యూరి భాస్కర్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇటీవల ఎన్నికైన మాలీ సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లెండుగురే శ్యాంరావు, ఆదె వసంత్ రావు, వాసు, నికాడే గంగారాంను ఘనంగా సన్మానించారు.
కాగజ్‌నగర్ రూరల్, జనవరి 20 : రేగులగూడ గ్రామాన్ని సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి తాగు నీటి సమస్య పరిష్కరిస్తానన్నారు.