కాగజ్‌నగర్, అక్టోబర్ 5 : సిర్పూర్ పేపర్ మిల్లు యా జమాన్యం కార్మికులను శ్రమ దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీలోని తన నివాసంలో శనివారం రాత్రి సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. గోగర్ల శ్యామ్ రావు, చంద్రమోహన్‌రావు, చిలుముల వెంకటేశ్, ప్రభాకర్, అహ్మద్ హుస్సేన్, చక్రవర్తి, కొత్తకొండ రాజేశ్, రజక సంఘం నాయ కులు రాదండి రాజులకు ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లా డుతూ పేపర్ మిల్లు యాజమాన్యం స్థానికులకో న్యా యం.. స్థానికేతరులకో న్యాయం అన్నట్లుగా వ్యవహ రిస్తున్నదని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. మూతపడ్డ ఎస్పీఎంకు రూ. వందల కోట్ల రాయితీ కల్పించి తిరిగి తెరిపించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌దేనని కొనియాడారు. యాజమాన్యం స్థానికులకు ఉద్యోగా వకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు ప్రాధాన్యమిస్తున్నదన్నారు. పేపర్ మిల్లులో కనీసం కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిల్లులో కనీస సౌకర్యాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారన్నారు.
విధి నిర్వహణలో కార్మికుడు మృతి చెందితే రావాల్సిన బెనిఫిట్స్ కూడా సక్రమంగా అందడం లేదన్నారు. మిల్లులో మృతి చెందిన కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల మృతి చెందిన కార్మికులకు ఎంతవరకు నష్టపరిహారం చెల్లించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నదని మిల్లు పునఃప్రారంభమై ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడం వెనుక మతలబేమిటని ప్రశ్నించారు.
మిల్లులో ఎన్నికలు నిర్వహిస్తా మని ఆర్భాటం చేసిన లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. మిల్లులో ఎన్నికలు జరుగుకుండా యాజమాన్యమే అడ్డుకుంటున్నదన్న ఆరోపణ లు సైతం ఉన్నాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పేపర్ మిల్లు కార్మికులకు కార్మిక చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలవెన్స్, బోనస్, తదితర బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కొంగ సత్యనారాయణ, గోలం వెంకటేశ్, అర్షద్ హుస్సేన్, పర్వతి అంజన్న, సద్వాం, కళావతి, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
బెల్లంపల్లి, అక్టోబర్ 5 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మలోతు రాజశేఖర్, మలోత్ సురేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం రాత్రి లింగాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారుకూరి వెంకటేశం ఆధ్వర్యంలో వారంతా బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇతర పార్టీ నాయకులు చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రెబ్బెన మండలానికి చెందిన యువ నాయకుడు బొడ్డు రాజ్‌కుమార్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఆమె కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అశోక్, నాయకులు భరద్వాజ్, వినోద్ జైశ్వాల్ ఉన్నారు.
దండేపల్లి, అక్టోబర్ 5 : కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చ డంలో పూర్తిగా విఫలమైందని, రేవంత్‌రెడ్డి పాలన నచ్చకే ఆ పార్టీ నుంచి అనేక మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన సీనియర్ నాయకులు సేదం బాపు, ఏదుల బుచ్చన్న, మార్నేని చిన్న ఆదివారం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, యువ నాయకుడు విజిత్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ నాయకులు ఉస్మాన్‌ఖాన్, నజీర్ ఉన్నారు.