అచ్చంపేట రూరల్, జూన్ 27 : ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు గతంలోనే మాదిరిగానే ప్రభుత్వం డీబీఎం(డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్) చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో టన్నెల్లో పరిస్థితులను పరిశీలించి సర్కారుకు నివేదిక అందించనున్నట్లు ఆర్అండ్ఆర్ (భూ నిర్వాసితుల పునరావాసం) కమిషనర్ శివకుమార్ నాయుడు తెలిపారు. శు క్రవారం అడిషనల్ కలెక్టర్ అమరేందర్తో కలిసి ఆయన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని అవుట్లెట్ సొరంగ ప నులను పరిశీలించి పరిస్థితిని అంచనా వేశా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమలపెంట సమీపంలో ఇన్లెట్ టన్నెల్ లోపల పైకప్పు కూలిన దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. సొ రంగంలో పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. మిగిలిన 9.53 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వడానికి మన్నెవారిపల్లి వద్ద పనులు చేపట్టే ప్రాం తంలో భవిష్యత్తులో ఎదురయ్యే ఇ బ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చినట్లు చెప్పారు.
అమెరికా నుంచి టీబీఎం బేరింగ్ను ఇప్పటికే తెచ్చారని, టన్నెల్లో పరిస్థితులను తెలుసుకొనేందుకు ఎన్జీఆర్ఐ(నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) బృందం నిపుణులు, ప్రొఫెసర్ తివారీ పర్యవేక్షణలో ఔట్లెట్ సొరంగం నుంచి పనుల ను ప్రారంభించడానికి డెన్మార్క్ నుంచి అ త్యాధునిక ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పరికరాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. జూలై రెం డో వారంలో వైమానిక దళ హెలీకాప్టర్లను వినియోగించి లైడార్ సర్వే చేపట్టనున్నట్లు చెప్పారు.