బోథ్, అక్టోబర్ 27 : బోథ్ నియోజకవర్గంలో గులాబీదండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకు వివరిస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం బోథ్‌లో జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, రమణాగౌడ్, వెంకటరమణ, బుచ్చన్న, దేవీదాస్, సత్యనారాయణ, మహిళలు పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 27 : మండలంలోని తలమద్రి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముండే పాండురంగ్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, మాజీ కన్వీనర్ మేరాజ్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ నర్వాడే రమేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ బద్ధం పురుషోత్తం రెడ్డి, ఉప సర్పంచ్ సుమన్, బీఆర్ఎస్ నాయకలు షాబీర్, మాతిన్, సర్పంచ్‌లు సుభాష్ పాటిల్, రవి, మాజీ జడ్పీటీసీ కృష్ణకుమార్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, రాజేశ్వర్, గొనె లక్ష్మి, పాడురంగ్, శివరవి గంగాధర్, గణేశ్, మహేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 27 : మండలంలోని వాంకిడి, రాజురా, నారాయణపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్ ,సర్పంచ్‌లు అడిగం రాజు, విశాల్‌కుమార్, పెంట వెంకటరమణ, ఒర్స రాజు, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ అంబేకర్ పండరి, నాయకులు గాదె శంకర్, జాదవ్ గణేశ్, గులాబ్‌సింగ్, జాదవ్ వసంత్, మండాడి కృష్ణ, రాథోడ్ సురేందర్, రాజేశ్వర్, మదన్‌సింగ్, గులాబ్‌సింగ్, ప్రతాప్‌సింగ్, నారాయణ, అరుణ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, అక్టోబర్ 27: మండలంలోని గిర్నూర్, కాండ్లీ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికల్లో బోథ్ ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్ నానం రమణ, నాయకులు అల్కె గణేశ్, కొత్త శంకర్, చిల్కూరి భూమయ్య, మడిగే రమేశ్, తాండ్ర శ్రీనివాస్, నారడి మల్లేశ్, చైతన్య, సాయన్న, అజయ్, శేఖర్, సూది నందు, చట్ల గజ్జయ్య, బొడ్డు,శ్రీనివాస్, మడిగే రమణ, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.