మంచిర్యాలటౌన్, అక్టోబర్ 28: మంచిర్యాల పట్టణంలోని కాలేజ్‌రోడ్, పద్మనాయక ఫంక్షన్ హాలు, డిగ్రీ కాలేజీ ఏరియాలో అక్రమంగా నిలువ చేసిన 60 ట్రిప్పుల ఇసుక డంప్‌ను సోమవారం రెవెన్యూ, మైనింగ్ శాఖల సిబ్బంది సీజ్ చేశారు. మంచిర్యాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అజీజ్ ఆధ్వర్యంలో సోమవారం కాలేజ్రోడ్లో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేశారు.
సమీపంలోని గోదావరి నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను కొందరు వ్యాపారులు తీసుకువచ్చి అక్రమంగా నిలువ చేసినట్లు తెలిసింది. దాదాపుగా 60 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు ఆర్ఐ అజీజ్ తెలిపారు.