మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు వద్ద గల హస్తల మడుగు నుంచి మంగళవారం గంగాజలాన్ని సేకరించారు. 22 కుటుంబాలకు చెందిన 171 మంది మెస్రం వంశీ యులు పాదయాత్రగా తరలిరాగా.. రెండు వందల మంది హాజరయ్యారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఏడు రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. కేస్లాపూర్‌కు ఈనెల 21వ తేదీ వరకు చేరుకొని నాగోబాకు అభిషేకం చేయడంతో మహా జాతర ప్రారంభం కానుంది.
– జన్నారం/దస్తురాబాద్, జనవరి 10
జన్నారం, జనవరి 10 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని హస్తిల మడుగుకు మెస్రం వంశీయులు మంగళవారం చేరుకున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలాచరించి ప్రత్యేక పూజలు చేశారు. 22 కుటుంబాలకు చెందిన 171 మంది మెస్రం వంశీయులు పాదయాత్రగా తరలిరాగా.. 200 మంది హాజరయ్యారు. గంగాదేవికి ఏడు రకాల పిండి పదార్థాలతో నైవేద్యం సమర్పించారు. మెస్రం వంశీయుల పెద్ద గంగాదేవి, పితృదేవతలకు పూజలు చేశారు. ఝరిలో గంగాజలాన్ని సేకరించారు. దాన్ని కర్రకు కట్టి అందరూ పాదయాత్రగా పయనమయ్యారు. ఈ నెల 17న ఇంద్రాదేవి ఆలయానికి, అక్కడి నుంచి కెస్లాపూర్ నాగోబా ఆలయానికి ఈనెల 21న చేరుకుంటామని మెస్రం వంశీయులు తెలిపారు. అదే రోజు రాత్రి 9 నుంచి 11గంటల వరకు నాగదేవతకు గంగాజలంతో అభిషేకం చేసి, మహాజాతరను ప్రారంభిస్తామని మెస్రం వంశానికి చెందిన వెంకట్రావు పటేల్ తెలిపారు.
మల్లాపూర్ గోండుగూడెంలో బస
దస్తురాబాద్, జనవరి10 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలు దేరిన మెస్రం వంశీయులు సోమవారం రాత్రి దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గోండు గూడేనికి చేరుకున్నారు. స్థానిక ఆశ్రమ పాఠశాలలో బస చేశారు. వీరికి గ్రామ పటేళ్లు, మ్సైం వంశీయులు ఘన సాగ్వతం పలికారు. మెస్రం వంశీయులతో పాటు ఆదివాసీలు కూడా కుల దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మరుసటి రోజు ఉదయం పాదయాత్రగా దస్తురాబాద్-మంచిర్యాల జిల్లా జన్నారం మం డల సరిహద్దులోని గోదావరికి వెళ్లారు. కార్యక్రమంలో మండలానికి చెందిన మెస్రం వంశీయు లు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.