నార్నూర్ : ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ ( Retirement ) సహజమేనని అడిషనల్ డీఎంహెచ్ వో కుడ్మెత మనోహర్ ( Additional DMHO Manohar ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్వోగా విధులు నిర్వహిస్తున్న సముద్రం లక్ష్మీకాంతామణి పదవి విరమణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను వైద్య సిబ్బంది శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమానికి అడిషనల్ డీఎంహెచ్వో కుడ్మెత మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని, విధి నిర్వహణలో అందించిన సేవలు చిరస్థాయిలో నిలుస్తాయాన్నారు. కాంతామణి శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వైద్య వృత్తి అనేది ఎంతో గొప్పది అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జితేందర్ రెడ్డి, హెచ్ఈవో తులసీదాస్, హెల్త్ సూపర్వైజర్ చరణ్ దాస్, సత్యవ్వ, వైద్య సిబ్బంది ఉన్నారు.