రెబ్బెన : సింగరేణిలో ( Singareni ) విధులు నిర్వహిస్తూ మెడికల్ ఇన్ వాలిడేషన్ అయినా ఉద్యోగి రామగిరి రాజంకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ( GM Bhasker Reddy ) చెక్కు అందించారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరుగూడ ఓపెన్ కాస్ట్లో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్న రామగిరి రాజం మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు.
ఇందుకు సంబంధించిన చెక్కును జీఎం అందజేశారు. వచ్చిన డబ్బులు పొదుపుగా వాడుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని , కుటుంబ సభ్యులతో ఆనంద మైన జీవితం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జూపాక రాజేష్ , డీజీఎం ఐఈడీ ఉజ్వల కుమార్ బెహరా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వరరావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ బాబా తదితరులు పాల్గొన్నారు.