ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Khanapur) నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను (Integrated school ) ఖానాపూర్‌లోనే నిర్మించాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. స్కూల్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని పట్టణ శివారులోని 110 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సర్వే చేసి చూపించాలని వినతిపత్రం అందజేశారు.
ఖానాపూర్ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతానికి తరలిస్తే జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను తీవ్రం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకో, వంట వార్పు తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్‌కు వివరించినట్లు సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ నంది రామయ్య, నాయకులు సాగి లక్ష్మణ్ రావు, అంకం మహేందర్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.