ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 14 : జైనూర్ ఘటనలో ఆదివాసీల అక్రమ అరెస్టులను ఆపాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘాలు, రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు, బీఆర్ఎస్ నాయకురాలు మర్సుకోల సరస్వతి శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, ఘటన జరిగి 10 రోజులైనా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు బుర్శ పోచయ్య, మాడవి గుణవంత్ రావు, శ్రీనివాస్, సిడం శంకర్ ఉన్నారు.