కడెం మే 18 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో గల మిద్దెచింత గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించాలని సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ భవేశ్ మిశ్రకు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ.. గ్రామంలో 70 ఏండ్లుగా కరెంటు, రోడ్డు సౌకర్యం లేదని, అక్కడ 50 కుటుంబాల గిరిజనులు నివాసం ఉంటున్నారని, అధికారులు తక్షణమే స్పందించి కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడేపు గణేశ్, ఆత్రం మాణిక్రావు, మార్సుకోల లింగు పాల్గొన్నారు.