ఉట్నూర్, మార్చి 26 : ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిని బుధవారం కాయకల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ల్యాబ్, రోగులకు అందుతున్న సౌకర్యాలు, మందులు నిర్వహణ, పరిశుభ్రత, వికలాంగులు ఆసుపత్రికి వచ్చేందుకు సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, బెడ్స్ నిర్వహణ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉపేందర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిని కాయకల్ప టీం సందర్శించిందని, త్వరలో మరో టీం వస్తుందన్నారు. తమకు మూడేండ్లుగా కాయకల్ప సర్టిఫికెట్ వస్తుందన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.