ఆదిలాబాద్ : కోర్టు దస్త్రాలను డిజిటలైజేషన్ ( Digitization) చేయడం వల్ల అవి మరింత భద్రంగా ఉండి , ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు (Judge Prabhakar Rao) పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కోర్టులోని అన్ని దస్త్రాలను ( Court Records) డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
అనంతరం కోర్టు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా కోర్టులో మొదటిసారి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకొని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించాలని సూచించారు.
కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీల జైన్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్పీ సురేందర్రావు, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, జిల్లా క్షయ నివారణ అధికారి సుమలత , డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.