కౌటాల : కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత కరెంట్‌తో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా కృషి చేశానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Koneru Konappa) అన్నారు. కౌటాల మండలం తాటిపెల్లి గ్రామంలో రైతులు పండించిన మిర్చి పంటను (Chilli Crop) గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో కోనప్ప మాట్లాడారు.
గతంలో తాను ఎంఎల్ఏ గా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులందరికీ వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను (Free Power ) ఇప్పించానని గుర్తు చేశారు. రైతులను రాజు చేసేందుకు తాను అహర్నిశలు కృషి చేశానని, పంటకు కూడ మంచి గిట్టుబాటు ధర లభించిందని పేర్కొన్నారు. మండలంలోని అన్నీ గ్రామాల్లో బోర్లు వేసుకున్న రైతులకు విద్యుత్ కనెక్షన్ దగ్గరుండి ఇప్పించానని తెలిపారు.
పంట మార్పిడి చేస్తే రైతులకు మంచి దిగుబడి వస్తుందని , గిట్టుబాటు ధర వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఆయన వెంట కొమరం మాంతయ్య, వసంత్, మధుకర్, మనీష్, మౌనిష్, సంతోష్, శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.