బెల్లంపల్లిరూరల్, జనవరి 27: బూదాకలన్ శివారులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆర్డీవో హరిక్రిష్ణ పరిశీలించారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి త్వరలోనే నోటీసులు అందిస్తామని, నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు.
పోచమ్మ చెరువు పక్కన కబ్జాదారులు ఆక్రమించిన రెండెకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోచమ్మ ఆలయం పక్కనే నిర్మిస్తున్న ఫ్రీజర్ గదిని తహసీల్దార్ సుధాకర్, బెల్లంపల్లి ఇన్చార్చి మున్సిపల్ కమిషనర్ భుజంగం సమక్షంలో కూల్చివేశారు.