సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ సురేష్
గుండాల(జీ) గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేసి సర్పంచ్ గా రాథోడ్ సురేష్ బాధ్యతలు స్వీకరించారు.
నార్నూర్, నవంబర్ 10 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుండాల(జీ) గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేసి సర్పంచ్ గా రాథోడ్ సురేష్ బాధ్యతలు స్వీకరించారు. మండల పంచాయతీ అధికారి మహేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడు తూ..అనివార్య కారణాలతో సర్పంచ్ రాథోడ్ సురేష్ సస్పెండ్ కావడంతో ఉప సర్పంచ్ చంద్రకాంత్ కు సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. కాగా రాథోడ్ సురేష్ హైకోర్టును ఆశ్రయించి ఆర్డర్ తీసుకొవచ్చినట్లు తెలిపారు.
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సురేష్ కు ప్రమాణ స్వీకారం చేయించి సర్పంచ్ బాధ్యతలు అప్పగిం చినట్లు తెలిపారు. చంద్రకాంత్ ఉపసర్పంచ్ గానే ఉంటారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోతిరామ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కనక సత్యనారాయణ, తాడిహత్నూర్ సర్పంచ్ రాథోడ్ దిలీప్, కొత్తపల్లి సర్పంచ్ డిగంబర్, మాజీ సర్పంచ్ మెస్రం దాదారావ్, మాల్‌కు పటేల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

