‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయి, గత కొన్నేళ్లుగా నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్న జూలూరుపాడు మండలం భోజ్యాతండాకు చెందిన 13 మంది నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్...
– జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
– 46 ఎకరాలకు హద్దులు నిర్దేశించిన అటవీ శాఖ అధికారులు
- 13 మంది రైతులకు అధికారుల మొండిచేయి
జూలూరుపాడు, నవంబర్ 10 : సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయి, గత కొన్నేళ్లుగా నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్న జూలూరుపాడు మండలం భోజ్యాతండాకు చెందిన 13 మంది నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ బానోత్ వీరు నాయక్ డిమాండ్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం అటవీ శాఖ అధికారులు ఆయా రైతుల భూములను పరిశీలించి హద్దులు నిర్దేశించారు. 2018-19లో సీతారామ ప్రాజెక్టు కాల్వల నిర్మాణం కోసం భోజ్యాతండాకు చెందిన పలువురు గిరిజన రైతుల భూములను సేకరించారు. అయితే, ప్రాజెక్టు కాల్వకు ఇరువైపులా ఉన్న ఇతర రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన అధికారులు. 13 మంది గిరిజన రైతులకు మాత్రం నేటికీ పరిహారం అందించకుండా నిలిపివేశారు. పరిహారం కోసం బాధితులు గత ఏడేళ్లుగా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారుల పక్షపాత వైఖరి, నిర్లక్ష్యంతో విసిగిపోయిన బాధిత రైతులు చివరకు న్యాయం కోసం జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు.
ఎస్టీ కమిషన్ ఆదేశాలతో సర్వే
నిర్వాసితుల ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ తక్షణమే స్పందించింది. కమిషన్ ఆదేశాలతో కదిలిన జిల్లా అటవీ శాఖ అధికారులు భోజ్యాతండాలో పర్యటించారు. గిరిజన రైతులు చూపించిన హద్దుల మేరకు సుమారు 46 ఎకరాల భూమిని పరిశీలించి, అధికారికంగా హద్దులను నిర్దేశించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వీరు నాయక్ మాట్లాడుతూ.. గిరిజన రైతుల పట్ల అధికారులు గత ఏడేళ్లుగా చిన్నచూపు చూస్తూ కాలయాపన చేశారని, తద్వారా ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనులకు న్యాయం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు ఈ సందర్భంగా రైతుల పక్షాన ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఇకనైనా జాప్యం చేయకుండా తక్షణమే ప్రక్రియను పూర్తి చేసి, రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ ధారావత్ కాన్షీరామ్, నాయకులు గుగులోత్ కేశవ్, బానోత్ రమేష్‌తో పాటు బాధిత రైతులు శంకర్, రవి, జల, వెంకటరాజు, ధరావత్ చందు, ధరావత్ జ్యోతిబస్, నర్సింహారావు, బోడ భోజ్యా, ధరావత్ రవి, గుగులోత్ రాందాస్, గుగులోత్ బిచ్చా, బానోత్ చిలికి, మౌలాలి, ధరమ్‌సోత్ సక్రు, తాళ్లూరి చిన్న వీరయ్య, పెద్దవీరయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
శ్రీజ కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా
BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Sonia Gandhi: ఇందిరా గాంధీ కోపం.. కుర్చీలో వణికిపోయేదాన్ని : సోనియా గాంధీ
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

