ప్రజల భద్రత, సంక్షేమానికి కృషి
ప్రజల భద్రత, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దేవాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల మెడీలైఫ్, సన్‌రైజ్ దవాఖానల వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా, విశేష స్పం దన లభించింది.
- మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
- వెంకటాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
కాసిపేట, జూలై 16 : ప్రజల భద్రత, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దేవాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల మెడీలైఫ్, సన్‌రైజ్ దవాఖానల వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా, విశేష స్పం దన లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ, డీసీపీ భాస్కర్‌కు మహిళలు తిలకం దిద్ది, తలపాగా చుట్టి, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ వారిని వేదిక మీదికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా దేవాపూర్ ఎస్ఐ గంగారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ఐక్యంగా ఉంటూ ప్రగతి వైపు అడుగులు వేయాలని సూచించారు. యువతతో పాటు కుటుంబ సభ్యులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించిన వైద్యులు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ పెద్దలు, గ్రామస్తులను అభినందించారు.
ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, కంటి వైద్య నిపుణులు సేవలందించారు. బీపీ, రక్తంలో చకెర పరీక్ష, ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పర్స రమేశ్, దేవాపూర్ ఎస్ఐ గంగారం, కాసిపేట ఎస్ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్ఐ నరేశ్, రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, మెడీలైఫ్, సన్ రైజ్ హాస్పిటల్స్ వైద్యులు కుమార స్వామి, గౌతమ్, సిరిపురం శ్రీనివాస్, అభిన య్, బోస్, స్వాప్రిక, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

