నార్నూర్, అక్టోబర్ 7 : బంజారాల ఆధ్యాత్మిక గురువు రామారావు మహరాజ్ వర్ధంతిని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ మాట్లాడుతూ… బంజారాల ఆధ్యాత్మిక గురువు రామారావు మహరాజ్ చూపించిన సన్మాన మార్గాలను అనుసరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, పిసా చట్టం కోఆర్డినేటర్ రాథోడ్ సికిందర్, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్ ఆడే, గ్రామ పెద్దలు ఆడే పకీరా నాయక్, బానోత్ ప్రణీత సూరి సింగ్, అనిల్ నాయక్, విలాస్, బిక్కు, ధన్ లాల్, మోహన్, భారత్, శ్రీరామ్, తిరుపతి, ఫుల్ సింగ్ తదితరులు ఉన్నారు.