ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 12 : సమస్యలు పరిషరించకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట వీవోఏల 48 గంటల దీక్ష ముగింపు సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌తో కలిసి డీఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐకేపీవీవోఏలకు బకాయి ఉన్న స్త్రీ నిధి ఇన్సెంటివ్ను వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలని, గ్రామ సంఘాల నుంచి రావల్సిన రూ.3 వేలు ఇవ్వాలని, ఎన్నికల హామీ మేరకు రూ. 20 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుద్ధు, రోజా మాట్లాడుతూ వీవోఏలు అనారోగ్యంతో, ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని, కనీస బీమా సౌకర్యం లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వరర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ త్రివేణి, తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమా, నాయకులు సంతోష్, రవీందర్, సతీష్, శ్రీనివాస్, ధనరాజ్, తిరుపతి, మహేశ్వరి, సంతోష్, వనిత, ఆనందరావు, మధుకర్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న వీవోఏల ఆందోళన
నస్పూర్, నవంబర్ 12 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట వీవోఏలు చేపడుతున్న ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. ఐకేపీ వీవోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రంజిత్‌కుమార్ మాట్లాడుతూ వీవోఏలకు ప్రభుత్వం రూ. 20 వేల వేతనం ఇవ్వాలని, బకాయి ఉన్న స్త్రీనిధి ఇన్సెంటివ్ను వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలన్నారు. సోషల్ ఆడిట్ రద్దు చేయాలని, అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. లేకుంటే వీవోఏలందరూ ప్రజా భవన్‌ను ముట్టడిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, రాములు, పోశం, రజిత, అనిత, శారద, మహేశ్, వెంకటి, సమ్మన్న, తుకారాం, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, సురేష్, రమాదేవి పాల్గొన్నారు.