ఆదిలాబాద్, మే 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేశారు. 5,85,350 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది వానకాలంలో 5,79,124 ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఏడాది విస్తీర్ణం స్వల్పంగా 6,226 ఎకరాల్లో పెరిగింది. ఎప్పటిలాగే పత్తి పంట అధికంగా 4.40 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. గతేడాది 4.36 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా.. ఈ ఏడాది 4 వేల ఎకరాల వరకు విస్తీర్ణం పెరగనుంది. సోయా 62,500, కంది 55వేలు, మక్క 2300, జొన్న 16 వేలు, వరి 1900, పెసర 550, మినుములు 550 ఎకరాలు, ఇతర పంటలు 250 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. గతేడాదితో పోల్చితే సోయా 2500, కంది 2500 తగ్గంది. మక్క 8 వేల ఎకరాల్లో పెరిగింది. ఇతర పంటలు దాదాపుగా గతేడాది మాదిరిగానే ఉన్నాయి.
వానకాలానికి సంబంధించి అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్న ట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 35 వే ల మెట్రిక్ టన్నుల యూరియా, 13వేల మెట్రిక్ ట న్నుల డీఏపీ, 36 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 7వేల మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 4వేల మెట్రిక్ ట న్నుల ఎస్ఎస్పీ అవసరవుతాయని అధికారులు అంచ నా వేశారు. ప్రస్తుతం జిల్లాలో 18 వేల మెట్రిక్ టన్నుల యూరి యా, 4వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 24 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1134 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 1071 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ అందుబాటులో ఉన్నాయన్నారు. 12 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 18725 సోయాబిన్, 21,960 కంది ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.