ఎదులాపురం, జూన్ 30: ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్లో ఇబ్బందులు ఉండకూడదని సంఘం తరఫున కంప్యూటర్లు ఏర్పాటు చేశామని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు స్వామి తెలిపారు.
ఆదివారం విద్యానగర్‌లో ఎస్జీటీ ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించామన్నారు. నెట్ సౌకర్యాలున్న బాధ్యులు కూడా వారివారి పరిధిలో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. శనివారం రాత్రి నుంచి వెబ్ ఆప్షన్ ప్రారంభమైందని, ఆదివారం రాత్రి 10 గంటల వరకే ఓపెన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షురాలు సురేఖ, రాష్ట్ర కమిటీ సభ్యుడు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.