ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్నిఅగౌరపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై టీఎన్జీవో ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని మాట్లాడడం నీ హోదాకు తగదని.. వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మల్‌లో టీఎన్జీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఆదిలాబాద్‌లో జిల్లా కార్యదర్శి ఎ.నవీన్‌కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి10 : రాజ్యసభలో తెలంగాణపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యా ఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి ఏ నవీన్‌కుమార్ డిమాండ్ చేశా రు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై టీఎన్జీవో కేంద్ర సంఘం పిలుపు మేరకు గురువారం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీ లు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. చాలా అవమానకర రీతిలో మాట్లాడిన ప్రధాని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర సభ్యులు ఏ తిరుమల్ రెడ్డి, సంజ య్, రాజు, నవీమ్, తౌఫిక్, నరేందర్, శశికళ, రజిత, నవీన్, దినేశ్ పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : పార్లమెంట్ సాక్షిగా దేశప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో తెలంగాణ ఉద్యమాన్ని అగౌరవపరుస్తూ రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని పేర్కొనడాన్ని నిరసిస్తూ టీఎన్జీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేం ద్రంలో టీఎన్జీవో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధ రించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో మంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఆ విషయాన్ని ప్రధాని మరచిపోయారని పేర్కొన్నారు. టీఎన్జీవో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ప్రవీణ్, సురేందర్, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, అశోక్, విఠల్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు.