మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 26: కాశ్మీర్లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ వాసులు శనివారం కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ తీశారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టి కరిపించాలని పేర్కొన్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు, మహిళలున్నారు.
ఉగ్రవాదుల ప్రేరేపిత దేశంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుందని ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయం నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు కొవ్వొతులతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల దాసు, ఖలిందర్ అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, లింగం రవి, వనం సత్యనారాయణ, దొడ్డిపట్ల రవీందర్, దుర్గారాజ్, చాడ మహేందర్ రెడ్డి, కుంచాల శంకరయ్య, పూజారి రామన్న, కోడి వెంకటేశ్, తంగళ్లపల్లె సురేశ్, పద్మ, తిరుమల, అరుణ పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 26: కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ పాఠశాల మైధానంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఫిట్నెస్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 26: జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు టీబీజీకేఎస్ నాయకులు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని ఆవరణలో కొవ్వొత్తులతో ర్యాలీ తీసి, రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులను పూర్గిగా అరికట్టేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యులు రమణ, దాసరి శ్రీనివాస్, బడికల రమేశ్, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కార్యదర్శి రవికిరణ్, పిట్ కార్యదర్శి హన్మంతరావు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. –