కోటపల్లి, జూన్ 19 : 108 అంబులెన్స్‌కు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తప్పవని 108 వాహనాల ఉమ్మడి ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ హెచ్చరించా రు. బుధవారం కోటపల్లి మండలకేంద్రంలోని 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసి సేవలపై ఆరా తీశా రు. కొంతమంది ఆకతాయిలు 108కి అనవసరం గా కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలా గే కొనసాగితే పోలీస్‌లకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అంబులెన్స్ నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. 108కు కాల్ రాగానే పైలెట్, ఈఎంటీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవాలని, అక్కడ బాధితులకు వై ద్యం అందించి వెంటనే దవాఖానలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో 108 మంచిర్యా ల జిల్లా కార్యనిర్వహణాధికారి సంపత్, ఈఎం టీ ఓలపు పోచన్న, పైలెట్ ఫరీద్అహ్మద్ పాల్గొన్నారు.