ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, నవంబర్ 4 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషరించేలా చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధో త్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా మార్పిడి, భూ సమస్యలు, దివ్యాంగ, వృద్ధాప్య, వితంతు పింఛన్ మంజూరు చేయాలని, రుణమాఫీ చేయాలని, తదితర సమస్యలపై అర్జీలను ప్రజలు అందించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అర్జీలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
సర్వేను సమన్వయంతో పూర్తి చేయాలి
ఇంటింటా సమగ్ర సర్వేను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
నస్పూర్, నవంబర్ 4 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతీలాల్, వివిధ శాఖల అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు భూసమస్యలు, పింఛన్లు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు అందించారు.