కాసిపేట : మండల స్థాయి పోటీల్లో ( Competitions ) గెలుపొందిన విజేతలకు ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి( MEO Venkateshwara Swamy) బహుమతులు అందజేశారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీ సాట్, గజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉపన్యాస , వ్యాస రచన ,టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు.
ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణాన్ని రక్షిద్దాం అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో మొదటి బహుమతి ప్రీతి కుమారి, రెండో బహుమతి సహస్ర, మూడో బహుమతి సాయి తేజ గెలుచుకున్నారు. ‘ విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత.. తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో మొదటి బహుమతి అశ్రత్ సాయి, రెండో బహుమతి తనియా చూర, మూడో బహుమతి అవంతిక గెలుపొందారు.
టాలెంట్ టెస్ట్ లో 50 ప్రశ్నలకు సంబంధించి పోటీ పరీక్షల్లో మొదటి బహుమతి అల్లం సాత్విక, రెండో బహుమతి శ్రీ వర్ష, మూడో బహుమతి అశ్విత గెలుపొందారు. గెలుపొందిన మూడు విభాగాల్లోని మొదటి బహుమతి సాధించిన విద్యార్థులు ఈ నెల 7వ తేదీన జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్వో రాథోడ్ రమేష్, కాంప్లెక్స్ హెచ్ఎం ఎల్. సుధాకర్ నాయక్, కాసిపేట ఇన్చార్జి హెచ్ఎం అన్నం రమణారెడ్డి, న్యాయ నిర్ణేతలు గణేష్, శంకర్, మోహన్, అరుణ, జ్యోతి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.