కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కే) గ్రామం ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సూపర్ పత్తి ( Super Cotton ) , మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన కంపెనీ ఆధ్వర్యంలో సంక్రాంతి( Sankranthi ) పండుగ సందర్భంగా శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
స్థానిక సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ, కంపెనీ ప్రతినిధి అభారావ్ సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు, బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి గెలుపొందిన బందెల రాణి కి ప్రెషర్ కుక్కర్, 2వ బహుమతి సాతం సన్నుత కు మిక్సీ, మరో 10 మందికి హాట్ బాక్సులు అందజేశారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దుంపెటి రాములు, ఉపసర్పంచ్ పట్టెపు పోశెట్టి, లంక పోశెట్టి, సుంకరి రఘు, మరాఠి శంకర్, ఓంకార్, రవి,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.