బెల్లంపల్లి, అక్టోబర్ 5 : రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి తదితర నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసర ధరలు తగ్గిస్తామని ప్రకటించిన మోదీ ఇప్పుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, పూర్ణిమ, లక్ష్మీనారాయణ, ఉపేందర్, చంద్రమాణిక్యం, బాపు, అమృత,సోని, ఐలయ్య, రాంచందర్, రాజం, తిలక్, శ్రీను, ప్రశాంత్, తిరుపతి, మారాలు, రాజలింగం, వెంకటస్వామి, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.