నస్పూర్, జూలై 4 : నిరుద్యోగ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘హలో నిరుద్యోగి.. చలో హైదరాబాద్’కు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం యేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చేయలేదని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అరెస్టు అయిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, జుమ్మిడి గోపాల్, చేరాల వంశీ ఉన్నారు.
కోటపల్లి, జూలై 4 : కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు బాపునాయక్ను కోటపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారంలోకి వ చ్చిన యేడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెంటనే ఉద్యోగాల నియమాకల ప్రక్రియ చేపట్టాలన్నారు.
మందమర్రి, జూలై 4 : రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, నిర్బంధాల అరెస్టుల పాలన అని బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై, సోషల్ మీడియా, టీవీజేఎస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు భట్టు రాజ్‌కుమార్, ఎండీ ముస్తఫా, సీపెల్లి సాగర్, బచ్చలి ప్రవీణ్‌కుమార్, అభిరామ్‌లను మందమర్రి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రామకృష్ణాపూర్, జూలై 4 : బీఆర్ఎస్వీ నాయకుడు రామిడి లక్ష్మీకాంత్‌ను శుక్రవారం ఉదయం రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఖండించారు. హామీలు అమలు చేయడం చేతగాకనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని ఆరోపించారు.
హాజీపూర్, జూలై 4 : నిరుద్యోగులను అరెస్టు చేయడం అన్యాయమని ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 4 : చలో హైదరాబాద్‌కు వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.