నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 20 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైఐఎస్‌యూ పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ-ఏటీసీలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే ఈ ధర్నాలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎదులాపురం, ఆగస్టు 20 : పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల బంద్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పాలిటెక్నిక్ కళాశాలల బంద్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కళాశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు బంద్ చేయించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఇషాంత్, నాయకులు నితిన్, రాధేశ్యామ్, మజర్, డీవైఎఫ్ఐ కో-కన్వీనర్ సిరిగిరి దశాంత్ చరణ్ పాల్గొన్నారు.