సీసీసీ నస్పూర్/బెల్లంపల్లి, మే 12 : ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల జిల్లా పాలిసెట్ కో-ఆర్డినేటర్లు శ్రీనివాసరావు, దేవేందర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నస్పూర్‌లో రెండు, మంచిర్యాలలో ఎనిమిది, బెల్లంపల్లిలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 3639 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. గంట ముందే హాజరుకావాలని, హెచ్‌బీ/2బీ బ్లాక్ పెన్సిల్, రబ్బర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకురావాలని, హాల్ టికెట్‌పై ఫొటో ప్రింట్కాని విద్యార్థులు పాస్‌పోర్టు సైజ్ ఫొటో గాని లేక ఐడీ ప్రూఫ్ కోసం ఒరిజినల్ ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని, నిమిషం ఆసల్యమైనా అనుమతించేది లేదని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, మే 12 : పాలిసెట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 4 కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇది అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.