పూలాజీ బాబా జీవితం ఆదర్శం
పూలాజీ బాబా జీవితం సమస్త మానవాళికి ఆదర్శమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు.
- ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఉట్నూర్ రూరల్, నవంబర్ 23 : పూలాజీ బాబా జీవితం సమస్త మానవాళికి ఆదర్శమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని పాటాగూడలో బుధవారం శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా ఆలయ 15వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబా చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పూలాజీ బాబా ప్రవచనాలు ప్రజల్లో మార్పును తీసుకువచ్చాయన్నారు. చెడు మార్గంలో నడిచేవారు బాబాను దర్శించుకొని మంచిగా మారిన కుటుంబాలెన్నో ఉన్నాయని పేర్కొన్నారు. పాట్నాపూర్‌కు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తరలి వచ్చేవారని తెలిపారు. అనంతరం చైర్మన్‌ను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, వైస్ ఎంపీపీ దావులె బాలాజీ, మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, మెకాసి, మాజీ ఎంపీటీసీ సలీమ్, పూలాజీ బాబా కుమారుడు కేశవ్, పటేల్ రాములు, తుకారాం, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తా..
ఇంద్రవెల్లి, నవంబర్ 23 : మండల కేంద్రంలోని ప్రభుద్ధనగర్కు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని జడ్పీ చైర్మన్ అన్నారు. ప్రభుద్ధనగర్కు చెందిన దళిత సంఘాల నాయకులు బుధవారం సాయంత్రం ఉట్నూర్‌లోని ఆయన నివాసంలో జడ్పీ చైర్మన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తమకు ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేయాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, జడ్పీ నిధుల నుంచి మంజూరు చేస్తానని హమీచ్చారు. కాంబ్లె మనోహర్, సోన్‌కాంబ్లె బాబాసాహెబ్, అనిల్, మీర్జా ఆరీఫ్బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Phulaji Baba
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

